Ramgopal varma: రాంగోపాల్ వర్మకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

  • పెళ్లిళ్లు, అంత్యక్రియలపై ఆర్జీవీ తాజా ట్వీట్
  • సోషల్ మీడియాలో చర్చకు దారి తీసిన తాజా ట్వీట్
  • దేనినీ వదలడం లేదంటూ నెటిజన్ల మండిపాటు

ట్వీట్లతో సంచలనం  సృష్టించడంలో సిద్ధ హస్తుడైన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన తాజా ట్వీట్ కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) అంటూ కలకలం రేపిన వర్మ తాజాగా పెళ్లిళ్లు, అంత్యక్రియలు అంటూ సరికొత్త ట్వీట్ చేశాడు. అసలు ఈ పెళ్లిళ్లు, అంత్యక్రియలు  అంటే తనకు అసహ్యమని, ఇందులో ఒకటి వ్యక్తి స్వాతంత్ర్యాన్ని చంపేస్తే, మరోటి శరీరాన్ని చంపేస్తుందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్తా, ఇప్పుడు సంచలనం అయింది.

వర్మ ట్వీట్‌పై నెటిజన్లు బాగానే స్పందిస్తున్నారు. ‘‘అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి సర్’’ అని ఒకరు ప్రశంసిస్తే.. ‘‘తమరి సినిమాలపైనా మాకు అదే భావన’’ అని ఇంకొకరు చురకలంటించారు. ఇలాంటి అర్థం పర్థం లేని ట్వీట్లు ఏంటంటూ మరొకరు విరుచుకుపడ్డారు. మీరు చేసే  పోస్టుల అర్థం తనకు అర్థం కాకున్నా అందులోని రిథమ్ తనకు నచ్చుతుందని మరొకరు కామెంట్ చేశారు. ప్రపంచంలోని ఏ రంగాన్నీ వదలని వర్మ ఇప్పుడు చావును కూడా వదల్లేదని మరొకరు ట్వీటారు.

Ramgopal varma
Director
Twitter
Death
Marriage
  • Loading...

More Telugu News