jena sena: వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి: ‘జనసేన’ కార్యాలయం వద్ద హాస్య నటుడు వేణుమాధవ్!

  • పవన్ కల్యాణ్ కు కొత్త పంట బియ్యం ఇవ్వడం నాకు అలవాటు
  • పవన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమే
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయి
  • ఇది నా వ్యక్తిగత అభిప్రాయం: వేణుమాధవ్

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కనుక ఆదేశిస్తే, ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ని కలిసేందుకు వేణుమాధవ్ వెళ్లారు. అయితే, పవన్ కల్యాణ్ అప్పుడే ఇంటికి వెళ్లడంతో వేణుమాధవ్ నిరాశ చెందాడు.

అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కు కొత్త పంట బియ్యం ఇచ్చి, ఆయన తోటలో కాసిన మామిడి పండ్లను తీసుకెళ్లడం తనకు అలవాటని చెప్పాడు. ఈ సందర్భంగా రాజకీయాల గురించీ వేణుమాధవ్ ప్రస్తావించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టడం మంచి పరిణామం అని అన్నాడు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వేణుమాధవ్, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, జనసేన పార్టీకి తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నాడు. కాగా, నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ తరపున వేణుమాధవ్ ప్రచారం చేశాడు.

jena sena
Pawan Kalyan
comedian venumadhav
  • Loading...

More Telugu News