Chandrababu: ఒకవేళ ‘కేంద్రం’ ఆ పని చేస్తే సీట్లన్నీ చంద్రబాబు గెలుస్తాడు : ఉండవల్లి అరుణ్ కుమార్

  • ఏపీకి అన్యాయంపై టీడీపీ ఎంపీలు వెల్ లోకి వెళ్లి గొడవ చేస్తే ఒరిగేదేమీ ఉండదు
  • కేంద్రాన్నిచంద్రబాబు ప్రశ్నిస్తే జైలుకు పంపుతారనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి
  • రాజకీయ నాయకుడనేవాడు జైలుకెళ్లడానికి భయపడటమేంటి! : ఉండవల్లి

‘ఒకవేళ కేంద్రాన్ని చంద్రబాబునాయుడు గట్టిగా ప్రశ్నిస్తే ఆయన్ని జైలుకు పంపిస్తే.. వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ చంద్రబాబు గెలుస్తాడు’ అని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరడగంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడుతున్న విషయమై ఓ ఇంటర్వ్యూలో ఉండవల్లి మాట్లాడుతూ,‘ ‘పార్లమెంట్ ఉభయసభల్లో వెల్ లోకి వెళ్లి గొడవ చేయండి’ అని తమ ఎంపీలకు చంద్రబాబు చెబుతున్నారు. అలా చేయడం వల్లే ఏం ప్రయోజనం ఉండదు.

జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్నే ‘జైల్లో పెట్టేస్తారుట’ అనే మాటలు వింటున్నాం. ‘చంద్రబాబునాయుడు కేంద్రాన్ని ప్రశ్నించకపోవడానికి కారణం ‘ఆయన మీద కేసులు ఉన్నాయిట .. జైల్లో పెట్టేస్తారట’ అని, ‘కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి  ప్రశ్నించకపోవడానికి కారణం..ఆయన మీద కేసులున్నాయి’ అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. రాజకీయ నాయకుడనేవాడు జైలుకు వెళ్లడానికి భయపడటమేంటి! ఒకవేళ కేంద్రాన్ని చంద్రబాబునాయుడు గట్టిగా ప్రశ్నిస్తే ఆయన్ని జైలుకు పంపిస్తే.. వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ చంద్రబాబు గెలుస్తాడు’ అంటూ ఉండవల్లి చెప్పుకొచ్చారు.

Chandrababu
undavalli arunkumar
Narendra Modi
  • Loading...

More Telugu News