the rock: ఆకట్టుకుంటున్న 'ద రాక్' 'స్కై స్క్రాపర్' సినిమా ట్రైలర్...వీడియో చూడండి

  • రాక్ గా పేరుతెచ్చుకున్న డ్వెయిన్ జాన్సన్
  • ‘స్కై స్క్రాపర్‌’ సినిమాలో ఒంటికాలుతో సాహసాలు
  • ఆకట్టుకుంటున్న ‘స్కై స్క్రాపర్‌’ ట్రైలర్

'ద రాక్'గా డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుని, హాలీవుడ్ లో రంగప్రవేశం చేసి, మంచి నటుడనిపించుకున్న ప్రముఖ నటుడు డ్వెయిన్‌ జాన్సన్‌ చేసిన స్టంట్ ఒకటి సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. డ్వెయిన్ జాన్సన్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘స్కై స్క్రాపర్‌’ సినిమా ట్రైలర్ ను దర్శకుడు రాసన్‌ మార్షల్‌ థర్బర్‌ విడుదల చేశారు.

ఈ సినిమాలో డ్వెయిన్ మాజీ ఎఫ్బీఐ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాలు కోల్పోయి, కృత్రిమ కాలుతో కుటుంబం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా డ్వెయిన్ నటిస్తున్నాడు. కాగా, ఈ సినిమా ట్రైలర్ లో 240 అంతస్తుల భవనంలో డ్వెయిన్ కుటుంబం చిక్కుకోగా, వారిని కాపాడేందుకు ఆ భవనంపై నుంచి దూకడాన్ని ఆసక్తికరంగా చూపారు. ఈ ట్రైలర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా లెజెండరీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సంస్థ నిర్మిస్తుండగా, దీనికి సహనిర్మాతగా డ్వెయిన్‌ జాన్సన్‌ వ్యవహరిస్తుండడం విశేషం. జులై 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  

the rock
dwayne johnson
sky scraper movie
trailer
  • Error fetching data: Network response was not ok

More Telugu News