Andhra Pradesh: బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు: మంత్రి గంటా

  • మిత్రపక్షం అధికారంలో ఉండి ఏపీని నిర్లక్ష్యం చేయడం ఘోరం 
  • రైల్వేజోన్ ఏర్పాటు చేయకుండా కుంటిసాకులు చెబుతోంది
  • కేంద్రం ఆలోచన సరిగ్గాలేదు: గంటా శ్రీనివాస్
  • చంద్రబాబునాయుడు మిత్రధర్మాన్ని పాటిస్తూ ఎంతో సహనంగా ఉన్నారు: నన్నపనేని రాజకుమారి

కేంద్ర ప్రభుత్వం తీరుపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మిత్రపక్షం అధికారంలో ఉండి ఏపీని నిర్లక్ష్యం చేయడం ఘోర తప్పిదమని, రైల్వేజోన్ ఏర్పాటుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ కుంటిసాకులు చెబుతోందని మండిపడ్డారు.

 రైల్వేజోన్లు, రైల్వే డివిజన్లు రాజకీయ నిర్ణయాలతో ఏర్పాటయ్యేవేనని, కేంద్ర విద్యా సంస్థలకు మొక్కుబడిగా నిధులిచ్చారని, రూ.4,500 కోట్లు అడిగితే రూ.218 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. కేంద్ర విద్యా సంస్థలకు ఏపీ ప్రభుత్వం 3658 ఎకరాలను కేటాయించిందని, నామ మాత్రపు చర్యలతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన సరికాదని అన్నారు.

కాగా, కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందిస్తూ, రాజకీయాలకు అతీతంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని, కేంద్ర బడ్జెట్ తో మిత్రపక్షమైన టీడీపీకి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్ ల గురించిన ప్రస్తావన బడ్జెట్ లో లేకపోవడం దారుణమని అన్నారు. తమ అధినేత చంద్రబాబునాయుడు మిత్రధర్మాన్ని పాటిస్తూ ఎంతో సహనంగా ఉన్నారని అన్నారు.

  • Loading...

More Telugu News