Tamilnadu: తమిళనాట మరో కొత్త కూటమి ఏర్పాటు!

  • తమిళ రాజకీయాల్లో మరో మార్పు
  • చేతులు కలిపిన శరత్ కుమార్, సీమాన్
  • కలసి పని చేస్తామన్న శరత్

తమిళనాడు రాజకీయాల్లో మరో మార్పు ఇది. సమత్తవ మక్కల్ కట్చి, నామ్ తమిళర్ కట్చి పార్టీలు కలసి ఓ కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ విషయాన్ని ఎస్ఎంకే అధ్యక్షుడు, హీరో శరత్ కుమార్ స్వయంగా వెల్లడించారు. ఈ ఉదయం మధురై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇక ఎన్టీకే అధినేత సీమాన్ తో కలసి తాము కలసి పోరాడతామని తెలిపారు. బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించారని ఆరోపించిన ఆయన, అంశాల వారీగా తమ పోరాటం ఉంటుందని అన్నారు. జయలలిత మృతితో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. కాగా, రజనీ, కమల్ కు వ్యతిరేకంగా తరచూ మాట్లాడుతూ ఉండే శరత్ కుమార్, సీమాన్ లు చేతులు కలపడం చర్చనీయాంశమైంది.

Tamilnadu
Sarat Kumar
Seeman
  • Loading...

More Telugu News