Vizag: విశాఖలో 100 మీటర్లు వెనక్కు వెళ్లిన సముద్రం... వీడియో చూడండి!

  • రుషికొండ బీచ్ లో ఘటన
  • చంద్ర గ్రహణం కారణంగానే
  • ఎంజాయ్ చేస్తున్న టూరిస్టులు

విశాఖపట్నంలోని ప్రముఖ బీచ్ లలో ఒకటైన రుషికొండ బీచ్ లో సముద్రం వెనక్కు వెళ్లింది. దాదాపు 100 మీటర్ల దూరం మేరకు సముద్రం లోపలికి వెళ్లిపోగా, అక్కడ నీటిలో మునిగి ఉండే భారీ బండరాళ్లు ఇప్పుడు పైకి తేలి కనిపిస్తున్నాయి. ఇటీవలి సంపూర్ణ చంద్రగ్రహణమే సముద్రం లోపలికి వెళ్లడానికి కారణమని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టులు, నగరవాసులు మాత్రం సముద్రంలో మరింత దూరం వెళ్లగలుగుతున్నామన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపై నడుస్తూ మరింత లోతుకు వెళ్లి వస్తున్నారు. సముద్రం వెనక్కు వెళ్లిన వీడియోను మీరూ చూడవచ్చు.

Vizag
Rushikonda
Beach
Lunar Eclips
  • Error fetching data: Network response was not ok

More Telugu News