Akkineni Akhil: ఉపాసన కజిన్ తో శ్రియా భూపాల్ వివాహం!

  • గతంలో అఖిల్ తో నిశ్చితార్థం
  • ఆపై ఆగిపోయిన వివాహం
  • ఉపాసన కజిన్ అనందిత్ తో వివాహం నిశ్చయమైనట్టు వార్తలు!

శ్రియా భూపాల్ పేరు తెలుసుగా?... జీవీకే కుటుంబంలో పుట్టిన ఆమె, అక్కినేని వారింట కోడలిగా కాలు పెట్టబోయి, కొన్ని కారణాలతో ఆ చాన్స్ కోల్పోయింది. అక్కినేని అఖిల్ తో శ్రియా వివాహ నిశ్చితార్థం తరువాత ఆగిపోయి, అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి రద్దు విషయంలో రెండు కుటుంబాలూ స్పందించలేదు. పెళ్లి రద్దయినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో ఆమె పేరు అఖిల్ పేరు పక్కన కనిపిస్తూనే ఉంది.

ఇక సమస్య పూర్తిగా సద్దుమణగాలంటే, సాధ్యమైనంత త్వరగా శ్రియా భూపాల్ పెళ్లి చేయాలని నిశ్చయించిన జీవీకే ఫ్యామిలీ అందుకు ఏర్పాట్లు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కజిన్ అనందిత్ తో శ్రియా వివాహం నిశ్చయమైనట్టు సమాచారం. ఈ విషయమై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుంది.

Akkineni Akhil
Upasana
Shreya Bhupal
  • Loading...

More Telugu News