: సచిన్ ను చూసి నేర్చుకోండి
పాక్ క్రికెటర్లకు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ గెలుపు పాఠాలు చెబుతున్నాడు. ప్రతీ ఒక్కరూ ఎవరికి వారుగా తమవంతు కష్టపడితేనే గెలుపు సాధ్యమని చెబుతున్నాడు. ఇందుకు ఉదాహరణగా సచిన్ ను చూపిస్తున్నాడు. "సచిన్ ను చూసి నేర్చుకోండి. ఇంకా టెస్టుల్లో ఆడుతున్నాడంటే అది అతడి కష్టపడేతత్వం వల్లే. అలానే మీరూ కష్టపడాలి" అని మియాందాద్ పాక్ క్రికెటర్లలో గెలుపు పాఠాలు నూరిపోస్తున్నాడు. రాబోయే ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ కోసం వారికిలా తర్ఫీదు ఇస్తున్నాడు.