Russia: రక్తం రంగులోకి మారిన నీరు... తలలు పట్టుకుంటున్న శాస్త్రవేత్తలు

  • ఎరుపురంగులోకి మారిన మోల్ చంక నది నీరు
  • రష్యాలోని ట్యుమెన్ నగరవాసుల దాహార్తి తీర్చే మోల్ చంక నది
  • నీరు ఎరుపు రంగులోకి ఎందుకు మారిందో తెలియక నిపుణుల ఆందోళన

రష్యాలోని ట్యుమెన్‌ నగరానికి దగ్గరలో ప్రవహిస్తున్న మోల్ చంక నదిలోని నీరు రక్తం రంగులోకి మారింది. దీంతో ఆ నీటితో దాహార్తి తీర్చుకునే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆ నది నీటిని పరిశోధించేందుకు వెళ్లిన నిపుణులు ఆ నీరు ఎందుకు రక్తం రంగులోకి మారిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నీటి శాంపిల్స్ టెస్టులు ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. రకరకాల రసాయన పదార్థాలు నీటిలో కలవడం వల్లే నది నీరు ఎరుపురంగులోకి మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. 

Russia
river
red water
  • Loading...

More Telugu News