Andhra Pradesh: బడ్జెట్‌పై నిరసనగా ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపు

  • విభజన చట్టం హామీల్లో ఏ ఒక్కదానికీ బడ్జెట్ కేటాయింపులు లేవు
  • సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి ఉపశమనం కలిగించే చర్యలు లేవు
  • పెరుగుతోన్న నిరుద్యోగానికి ఉపశమనం కలిగించలేదు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు, ప్రజలు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై చూపుతోన్న తీరుకి నిరసనగా ఈ నెల 8న బంద్‌కు పిలుపునిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రకటించారు.

 తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... విభజన చట్టం హామీల్లో ఏ ఒక్కదానికీ బడ్జెట్ కేటాయింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి ఉపశమనం కలిగించే చర్యలేవీ బడ్జెట్‌లో లేవని అన్నారు. పెరుగుతోన్న నిరుద్యోగానికి ఉపశమనం కలిగే చర్యలేవీ కూడా బడ్జెట్‌లో కనపడలేదని చెప్పారు. ఈ బంద్‌లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News