saudi arabia: సౌదీ అరేబియా రోడ్డుపై దంపతుల డ్యాన్స్.. దర్యాప్తుకు ఆదేశించిన రాజు!.. వీడియో చూడండి

  • సౌదీలో బహిరంగంగా డ్యాన్స్ చేయడం నిషిద్ధం
  • ముస్లిం సంప్రదాయాలకు విరుద్ధం
  • విచారణకు ఆదేశించిన రాజు

సౌదీ అరేబియాలోని అభా సిటీ రోడ్డుపై ఆ దేశానికి చెందిన దంపతులు చేసిన డ్యాన్స్ ఇప్పుడు అక్కడ కలకలం రేపుతోంది. వీరి డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరు డ్యాన్స్ చేస్తుండగా, రోడ్డుపైన వెళ్తున్నవారు వింతగా చూశారు. సౌదీ అరేబియాలో ఇలా బహిరంగంగా డ్యాన్స్ చేయడం నిషిద్ధం. ఇది ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధం. దంపతుల డ్యాన్స్ పై సౌదీ రాజు ఫైసల్ బిన్ ఖలీద్ విచారణకు ఆదేశించారు. గతంలో ఓ యువకుడు ఇలాగే బహిరంగంగా డ్యాన్స్ చేయడంతో, అప్పట్లో అతన్ని అరెస్ట్ చేశారు.

saudi arabia
couple dance
saudi king
  • Error fetching data: Network response was not ok

More Telugu News