Donald Trump: గాలి జనార్దన్ రెడ్డి కుడి భుజం శ్రీరాములుకు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం!

  • 7, 8 తేదీల్లో ట్రంప్ విందు
  • ఇండియా నుంచి ఫడ్నవిస్, శ్రీరాములుకు ఆహ్వానం
  • మరిచిపోలేని అనుభూతి అన్న శ్రీరాములు

ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుడి భుజం, బళ్లారి లోక్ సభ సభ్యుడు శ్రీరాములుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా గెలిచాక 130 దేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయతీగా వస్తోంది. ఇప్పుడు ట్రంప్ కూడా విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

 ఈ నెల 7, 8 తేదీల్లో విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇండియా నుంచి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు. వీరిలో ఒకరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కాగా, మరొకరు శ్రీరాములు. వీరిద్దరికీ ఇప్పటికే వైట్ హౌస్ నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు తనను ఆహ్వానించడం మరిచిపోలేని అనుభూతి అని చెప్పారు. 

Donald Trump
american president
sreeramulu
fadnavis
  • Loading...

More Telugu News