pak minister: బెడ్రూంలో భార్యను కాల్చిచంపి, ఆత్మహత్యకు పాల్పడిన పాకిస్ధాన్ సీనియర్ మంత్రి!

  • సింధ్ రాష్ట్ర ప్లానింగ్ అండ్ డెవలెప్ మెంట్ శాఖ మంత్రి మీర్ హజార్ ఖాన్ బిజ్రానీ
  • జర్నలిస్టుగా పని చేస్తున్న ఫరీహా రజాక్
  •  భార్యను మూడు సార్లు తుపాకీతో కాల్చి చంపిన భర్త

పాకిస్థాన్‌ లోని సింధ్‌ రాష్ట్రంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సీనియర్‌ నేత, ప్లానింగ్ అండ్ డెవలెప్మెంట్ శాఖ మంత్రి మీర్‌ హజార్‌ ఖాన్‌ బిజ్రానీ (71) జర్నలిస్టైన తన భార్య ఫరీహా రజాక్ ను బెడ్ రూంలో మూడు సార్లు తుపాకీతో కాల్చిచంపి, ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిద్దరి మధ్య నెలకొన్న కలహాల కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. కాగా, వారిద్దరి మృతదేహాలను వారి బెడ్‌ రూమ్‌ లో రక్తపుమడుగులో గుర్తించిన పోలీసులు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వర్తించారు. 

pak minister
Pakistan
minister wife murder
  • Loading...

More Telugu News