Chandrababu: చంద్రబాబు చెబితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: టీడీపీ నేత రాయపాటి

  • కేంద్ర బడ్జెట్ పై రాయపాటి అసంతృప్తి  
  • నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీలకు ఎంతో విలువ ఉండేది
  • ప్రస్తతం ఆర్ఎస్ఎస్ చెప్పిందే బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది
  • ఏపీకి అన్యాయం చేస్తే ‘కాంగ్రెస్’కు పట్టిన గతే బీజేపీకీ పడుతుంది

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబుతో సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని, బాబు చెబితే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని అన్నారు.

ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీలకు ఎంతో విలువ ఉండేదని, ప్రస్తతం ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఏది చెబితే అదే బీజేపీ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితిలో ఉందని విమర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఎంపీలను హీనంగా చూస్తున్నారని, ఏపీకి అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకీ పడుతుందని ఆగ్రహించిన రాయపాటి, ఇప్పటికే ఆ పార్టీపై ప్రజలు మండిపడుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News