manikyala rao: బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది: ఏపీ మంత్రి మాణిక్యాల రావు

  • దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీని సమానంగా చూస్తాము
  • దేశంలోని ఇతర రాష్ట్రాలు వేరు, ఏపీ వేరు అనడం సరికాదు
  • బడ్జెట్ బాగుందని మేము ప్రజల్లోకి వెళ్లి చెప్పగలం
  • ఏపీకి అన్యాయం జరిగిందన్న వాదన మిత్ర పక్షంలోని కొందరిది మాత్రమే

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఏపీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాల రావు మాత్రం కేంద్ర బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందంటూ కితాబిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీని సమానంగా చూస్తామని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు వేరు, ఏపీ వేరు అనడం సరికాదని చెప్పుకొచ్చారు. బడ్జెట్ బాగుందని తాము ప్రజల్లోకి వెళ్లి చెప్పగలమని అన్నారు. డీపీఆర్ లేకపోవడంతోనే ఏపీ రాజధానికి నిధులు కేటాయించలేదని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందన్న వాదన తమ మిత్ర పక్షంలోని కొందరు మాత్రమే చెబుతున్నారని పేర్కొన్నారు.   

manikyala rao
Andhra Pradesh
Union Budget 2018-19
  • Loading...

More Telugu News