BJP: బడ్జెట్లో తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు కానీ, ఇక్కడ అధికారంలోకి వస్తామంటున్నారు: వీహెచ్

  • రాజస్థాన్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచింది
  • వచ్చే ఎన్నికల్లో దేశం మొత్తం ఇవే ఫలితాలు వస్తాయి
  • కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు వచ్చిన‌ప్పుడు కేసీఆర్‌ను పొగుడుతారు
  • స్థానిక బీజేపీ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తారు

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ బడ్జెట్‌పై తెలంగాణ‌ కాంగ్రెస్ నేత వీ హ‌నుమంత‌రావు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. బీజేపీ పట్ల వ్యతిరేకత వల్లే రాజస్థాన్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచింద‌ని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో దేశం మొత్తం ఇవే ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు. కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు వచ్చిన‌ప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను పొగుడుతారని, మ‌రోవైపు స్థానిక బీజేపీ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అంటే బీజేపీ రెండు ర‌కాలుగా మాట్లాడుతోంద‌ని తెలిపారు. నిన్న ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర‌ బడ్జెట్లో తెలంగాణకు ఏమీ ఇవ్వ‌లేద‌ని, మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీదే అధికారమని చెప్పుకుంటున్నార‌ని తెలిపారు. 

  • Loading...

More Telugu News