Chandrababu: మేము పదవుల కోసం బీజేపీతో పొత్తు కొనసాగించడం లేదు: చంద్రబాబు

  • రెండు మంత్రి పదవులు అక్కడ మనకు నామమాత్రంగానే ఉన్నాయి
  • రాజకీయ లబ్ధి కాకుండా ప్రజలకు ఏది మేలో అదే నేతలు మాట్లాడాలి
  • ప్రజలకు ఉపయోగపడే విధంగా మన నిర్ణయం ఉండాలి
  • అందరి మనోభావాలు అర్థం చేసుకున్నా

తాము బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నది పదవుల కోసం కాదని, కేంద్ర ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు టీడీపీకి నామమాత్రంగానే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజకీయ లబ్ధి కాకుండా ప్రజలకు ఏది మేలో అదే నేతలు మాట్లాడాలని హితవు పలికారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం ఉండాలని, తాను అందరి మనోభావాలు అర్థం చేసుకున్నానని చెప్పారు. సమస్య పరిష్కారం అంత సులభతరమైంది కాదని, పార్టీలో లోతైన చర్చ జరగాలని వ్యాఖ్యానించారు.
 
గతంలో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారని, ప్రత్యేక ప్యాకేజీలో కూడా ఏ మాత్రం సాయం చేయలేదని చంద్రబాబు అన్నారు. రైల్వే జోన్ అంశం పక్కన పెట్టారని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. తమ నిర్ణయం ప్రజలకు అనుగుణంగా ఉండాలని, పోలవరం వంటి కీలక పనులు ఆగిపోతే పరిస్థితి ఏంటని కొందరు అంటున్నారని వ్యాఖ్యానించారు. సమన్వయంతో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. 

  • Loading...

More Telugu News