Bhagamati: చాలా థ్యాంక్స్ రామ్ చరణ్... నీ 'రంగస్థలం' బాగుండాలి!: అనుష్క

  • సినిమా చూసి రాత్రంతా తన భార్య నిద్రపోలేదన్న రామ్ చరణ్
  • స్పందించిన హీరోయిన్ అనుష్క
  • చిత్ర టీమ్ కృషే కారణమని వ్యాఖ్య
  • 'రంగస్థలం' కోసం ఎదురు చూస్తున్నానన్న అనుష్క

తాను ప్రధాన పాత్రలో నటించగా, ఇటీవల విడుదలై విజయవంతమైన చిత్రం 'భాగమతి'ని చూసిన తన భార్య రాత్రంతా నిద్రపోలేదని రామ్ చరణ్ వ్యాఖ్యానించడంపై అనుష్క స్పందించింది. థ్యాంక్యూ అంటూ కృతజ్ఞతలు తెలిపింది.

"థ్యాంక్యూ  సో మచ్ రామ్ చరణ్. మీ అందరికీ సినిమా నచ్చినందుకు ఆనందంగా ఉంది. 'భాగమతి' టీమ్ కృషే ఇందుకు కారణం. నీ 'రంగస్థలం' బాగుండాలని కోరుకుంటున్నా. ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా" అని తన ఫేస్ బుక్ ఖాతాలో కొద్దిసేపటి క్రితం ఓ పోస్టును పెట్టింది.

  • Loading...

More Telugu News