Tamilnadu: అన్నాడీఎంకేలో ముసలం... మరో 93 మందిని తొలగిస్తూ సంచలన నిర్ణయం!

  • టీటీవీ దినకరన్ కు అనుకూలంగా ఉన్న నేతలు
  • బహిష్కృతుల్లో మాజీ మంత్రి కూడా
  • సంయుక్త ప్రకటనలో ఓపీఎస్, ఈపీఎస్

టీటీవీ దినకరన్ వర్గంలో ఉన్నారన్న కారణంగా కన్యాకుమారి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పచ్చై మాల్ సహా 93 మందిని పార్టీ నుంచి బహిష్కరించాలని అన్నాడీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పన్నీర్ సెల్వం, పళనిస్వామి సంయుక్తంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

పార్టీ లక్ష్యాలకు, విధానానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కారణంగా వీరిని తొలగిస్తున్నట్టు తెలిపారు. కాగా, దినకరన్ ఆర్కే నగర్ నియోజకవర్గంలో గెలిచిన తరువాత, ఆయన వర్గంలోకి పెద్దఎత్తున అన్నాడీఎంకే నేతలు తరలి వెళుతుండగా, అధికార అన్నాడీఎంకేలో బహిష్కరణ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక జిల్లాలకు చెందిన పార్టీ నేతలను ఓపీఎస్, ఈపీఎస్ లు పార్టీ నుంచి బహిష్కరించారు.

Tamilnadu
AIADMK
OPS
EPS
TTV Dinakaran
  • Loading...

More Telugu News