Fidel Castro: ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడి ఆత్మహత్య!

  • గత కొన్ని నెలలుగా ఒత్తిడిలో డియాజ్ బలార్ట్
  • ఈ ఉదయం ఆత్మహత్య  
  • ప్రకటించిన క్యూబా అధికార మీడియా

క్యూబా విప్లవ నేత, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శనీయుడు ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడు ఫిడెల్ క్యాస్ట్రో డియాజ్ బలార్ట్ తీవ్రమైన ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా డిప్రెషన్ లో ఉన్న ఆయనకు వైద్యులు చికిత్సను అందిస్తుండగా, ఈ ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారని క్యూబా ప్రభుత్వ మీడియా 'క్యూబాడెబాటే' వెల్లడించింది. 68 ఏళ్ల డియాజ్ బలార్ట్, చూసేందుకు అతని తండ్రిలాగానే కనిపిస్తుండటంతో, అతన్ని 'ఫిడెలిటో' అని క్యూబన్లు ముద్దుగా పిలుచుకునేవారు. డియాజ్ బలార్ట్ మృతిపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

Fidel Castro
Cuba
Son
Diaz Ballart
  • Loading...

More Telugu News