ntr: రాజమౌళితో ఎన్టీఆర్, చరణ్ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!

  • బోయపాటితో చరణ్ 
  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ 
  • సెప్టెంబర్లో ఈ ప్రాజెక్టులు పూర్తి 
  • అక్టోబర్ నుంచి రాజమౌళితో  

రాజమౌళి తదుపరి సినిమా ఎన్టీఆర్, చరణ్ లతో వుండనుందనే సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే ఆసక్తితో అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించడానికి రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

బోయపాటితో చరణ్ చేయనున్న సినిమా సెప్టెంబర్లో పూర్తవుతుంది. ఇక త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేసే సినిమా కూడా అదే నెలలో పూర్తవుతుంది. అందువలన అక్టోబర్ నుంచి ఈ మల్టీ స్టారర్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని రాజమౌళి ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా బలమైన కథా కథనాలతో ఈ సినిమా కొనసాగుతుందట. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. ఇటు చరణ్ అభిమానులు ఈ ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్నారు.   

  • Loading...

More Telugu News