balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ లో ఇందిరాగాంధీ పాత్ర .. తెరపైకి ఇద్దరు సీనియర్ హీరోయిన్ల పేర్లు?

  • త్వరలో సెట్స్ పైకి ఎన్టీఆర్ బయోపిక్ 
  • ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు 
  • ఇందిరాగాంధీ పాత్ర కోసం అన్వేషణ  

ప్రస్తుతం తేజ .. వెంకటేశ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. పక్కా ప్లానింగ్ తో చాలా తక్కువ వర్కింగ్ డేస్ తో తేజ ఈ సినిమాను పూర్తి చేయనున్నాడు. ఆ వెంటనే ఆయన ఎన్టీఆర్ బయోపిక్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటించనున్న ఈ సినిమాలో, ఇందిరాగాంధీ పాత్ర కూడా కనిపించనుంది. ఈ పాత్రను ఎవరితో చేయించాలా అనే ఆలోచనలో తేజ వున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాత్ర కోసం విజయశాంతి .. నదియా పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరిని ఈ పాత్రకి ఎంపిక చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. సీనియర్ హీరోయిన్ గా విజయశాంతికి ఇక్కడ మంచి క్రేజ్ వుంది. ఇక ఈ మధ్య కాలంలో కీలకమైన పాత్రలను చేస్తూ నదియా మంచి మార్కులు కొట్టేసింది. మరి ఈ ఇద్దరిలో ఈ ఛాన్స్ ఎవరికి వెళుతుందో చూడాలి.     

  • Loading...

More Telugu News