yaswanth sinha: బీజేపీని వీడను... కావాలనుకుంటే బయటకు తోసేయండి: యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు

  • రైతుల కష్టాలు ఢిల్లీలో కూర్చున్న వారికి తెలియవు
  • వారి కష్టాలను ఆర్థిక సర్వే సైతం ఎత్తి చూపింది
  • బీజేపీ కంటే ఓ పౌరుడిగానే పెద్దవాణ్ణి

బీజేపీ సీనియర్ నేత, అసంతృప్త వాది, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని తాను వీడనని, పార్టీకి తాను దూరం కావాలనుకోవడం లేదని అన్నారు. కావాలంటే బీజేపీయే తనను బయటకు తోసేయవచ్చన్నారు. యశ్వంత్ సిన్హా ఇటీవలే రాష్ట్ర మంచ్ పేరుతో ఓ రాజకీయ వేదిక ఏర్పాటు చేశారు. బీజేపీ సభ్యుడిగా వుండడం కన్నా ఓ భారతీయ పౌరుడిగా ఉండడమే పెద్ద విషయమని ఆయన అన్నారు.

‘‘నేను పార్టీని వీడను. కానీ, వారు కోరుకుంటే నన్ను బహిష్కరించుకోవచ్చు’’ అని సిన్హా అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. రాష్ట్ర మంచ్ అనేది రైతులు, నిరుద్యోగుల ఉద్యమమని, ఢిల్లీ, భోపాల్ లలో కూర్చున్న వారికి రైతుల కష్టాలు తెలియవని ఎద్దేవా చేశారు. ఇటీవలి ఆర్థిక సర్వే సైతం నిరుద్యోగం,  రైతుల సమస్యలు, విద్యా సంబంధిత సమస్యలను ఎత్తిచూపించిందన్నారు.

  • Loading...

More Telugu News