: సదానందగౌడ పరాజయం
కష్టకాలంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ. ఆ పార్టీలో కీలక నేత మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ఓటమి పాలయ్యారు. పుత్తూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శకుంతల శెట్టి చేతిలో పరాజయం చవిచూశారు. ఇక్కడ గెలుపు ఖాయమని బీజేపీ విశ్వసించగా.. తాజా ఫలితం రుచించనిదే. యడ్యూరప్పపై లోకాయుక్త కేసు నమోదు చేశాక ఆయనను పక్కకు తప్పించి ముఖ్యమంత్రి పీఠంపై సదానందను బీజేపీ లోగడ కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే.