amalapal: సినీ నటి అమలాపాల్ కు లైంగిక వేధింపులు... పోలీస్ కేస్!

  • పారిశ్రామికవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అమలాపాల్
  • మలేసియాలో ఉన్న తన స్నేహితుడితో డిన్నర్ కు వెళ్లాలని కోరాడని ఫిర్యాదు
  • అళగేశన్ ను అరెస్టు చేసిన పోలీసులు

సినీ నటి అమలాపాల్‌ లైంగిక వేధింపుల బారినపడింది. ఈ మేరకు చెన్నైలోని మాంబళం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. డాన్స్ స్కూల్ యజమాని, పారిశ్రామిక వేత్త అయిన అళగేశన్ తనతో అసభ్యంగా, అశ్లీల భావంతో మాట్లాడాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. మలేసియాలో ఉన్న తన స్నేహితుడితో డిన్నర్ కు వెళ్లాలని కోరాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అమలాపాల్ మాట్లాడుతూ, మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, మాటలు, చేతలతో లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.  

amalapal
harassed
police complint
  • Loading...

More Telugu News