YSRCP: జనసేనతో మాకొచ్చే నష్టం ఏమీ లేదు.. జగన్ కీలక వ్యాఖ్యలు

  • మాపై జనసేన ప్రభావం నిల్
  • ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తుందన్నది అపోహే
  • పొత్తుల గురించి అప్పుడు మాట్లాడుకుందాం
  • వైసీపీ చీఫ్ జగన్

పవన్ కల్యాణ్ జనసేన పార్టీపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌తో కానీ, ఆ పార్టీతో కానీ తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. జనసేన ప్రభావం తమపై ఉండబోదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి పడకుండా జనసేన అడ్డుకుంటుందన్న వార్తల్లో వాస్తవం లేదని, అది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీకి 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని పేర్కొన్న జగన్.. ఆ ఎన్నికల్లో పవన్, మోదీ కలిసి ప్రచారం చేశారని గుర్తుచేశారు. వారిద్దరూ కలిసి ప్రచారం చేసినా టీడీపీకి అధికంగా వచ్చింది ఐదు లక్షల ఓట్లు మాత్రమేనన్నారు. పొత్తుల గురించి అడిగిన ప్రశ్నకు వైసీపీ చీఫ్ స్పందిస్తూ.. వాటి గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుందని అన్నారు. వాటి గురించి ఎన్నికలప్పుడు మాట్లాడుకుంటేనే బాగుంటుందని జగన్ చెప్పారు.

YSRCP
Jagan mohan reddy
Jana Sena
Pawan Kalyan
  • Loading...

More Telugu News