North Korea: ‘అణు దేశాన్ని’ మేము అణచివేస్తాం.. గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు: డొనాల్డ్ ట్రంప్‌

  • అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించిన ట్రంప్
  • ఉ.కొరియాను సరిగ్గా పట్టించుకోకపోవడంతో మా భద్రతను ప్రమాదంలోకి నెట్టారు 
  • గత ప్రభుత్వాలు చేసిన తప్పును మళ్లీ జరగనివ్వను

వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తూ తమ దేశాన్ని భయపెడుతోన్న ఉత్తర కొరియా తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మండిపడ్డారు. అణు దేశాన్ని అణచివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ట్రంప్ తొలిసారిగా అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగిస్తూ... తమ గత ప్రభుత్వాలు ఉత్తర కొరియా విషయాన్ని సరిగ్గా పట్టించుకోలేదని, భద్రతను ప్రమాదంలోకి నెట్టాయని ఆయన చెప్పారు.

కానీ, తాను మాత్రం ఆ తప్పు మళ్లీ జరగనివ్వనని తేల్చి చెప్పారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాల వల్ల భవిష్యత్తులో అమెరికాలోని చాలా నగరాలు ముప్పును ఎదుర్కొంటాయని తెలిపారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వల్ల గతేడాది ఆ దేశంలో చనిపోయిన అమెరికన్‌ విద్యార్థి గురించి మాట్లాడుతూ.. ఆ విద్యార్థి తన యాత్ర ముగించుకుని వస్తుండగా ఉత్తర కొరియా అధికారులు అతడిని అరెస్ట్‌ చేసి తప్పుడు కేసులు పెట్టారని, 15 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించారని చెప్పారు. అతడిని అమెరికాకు తీసుకు రావడానికి ముందు తీవ్రమైన గాయాలతో బాధపడ్డాడని, అమెరికాకు వచ్చిన కొన్ని రోజులకే మృతి చెందాడని ట్రంప్ వివరించారు.

  • Loading...

More Telugu News