delhi governament: ఆ 20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతకు ప్రాతిపదిక ఏంటో చెప్పండి: ఈసీకి హైకోర్టు ఆదేశం

  • ఈసీ అనర్హత వేటుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎమ్మెల్యేలు
  • ఎమ్మెల్యేల పిటిషన్ ను స్వీకరించి విచారించిన న్యాయస్థానం
  • ఈసీని లిఖితపూర్వక నివేదిక అడిగిన కోర్టు 

తమపై వేసిన అనర్హత వేటుపై 8 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం, ఈ కేసు తేలేంతవరకు ఎటువంటి ఉపఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేయవద్దని ఈసీని ఆదేశించింది. అనంతరం ఆ 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన అనర్హులుగా ప్రకటించారో చెప్పాలని ఢిల్లీ హైకోర్టు ఈసీని అడిగింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను లిఖితపూర్వకంగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా, లాభదాయక పదవుల్లో ఉన్నందుకు గాను ఆప్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాల్సిందిగా ఈసీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింగ్‌ ఈనెల 20న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 

delhi governament
election comission
delhi high court
  • Loading...

More Telugu News