mark salling: ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న అమెరికన్ నటుడు!

  • లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలు
  • దోషిగా తేల్చిన జడ్జి
  • శిక్ష ఖరారు కాకుండానే ఆత్మహత్య

అమెరికన్ యువ నటుడు మార్క్ సాలింగ్ తన నివాసంలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నాడు. మార్క్ ఆత్మహత్యకు పాల్పడ్డ విషయాన్ని ఆయన తరపు న్యాయవాది మైఖేల్ ప్రోకార్డ్ ఓ ప్రకటన ద్వారా తెలిపాడు. నిన్న ఉదయం ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పాడు.

పలు టీవీ సిరీస్ లలో నటించిన సాలింగ్ కు నటుడిగా మంచి పేరు ఉంది. 2015లో అతనిపై లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు 2016లో ఛార్జ్ షీట్ నమోదు చేశారు. అతని ల్యాప్ టాప్ ను పరిశీలించగా... దాదాపు 50 వేల చైల్డ్ పోర్నోగ్రఫీ ఫొటోలు, వీడియోలు లభించాయి. ఈ నేపథ్యంలో సాలింగ్ ను జడ్జి దోషిగా తేల్చారు. వచ్చే మార్చి 7న ఆయనకు శిక్ష ఖరారు కానుంది. ఈలోగానే సాలింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఆగస్టులో ఆయన ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

mark salling
american actor
suicide
  • Loading...

More Telugu News