Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • కాజల్ చెప్పిన ప్రేమలేఖల సంగతులు 
  • డబ్బింగ్ మొదలెట్టిన కమలహాసన్ 
  • ఒకరోజు లేటుగా వస్తున్న 'తొలిప్రేమ'
  • నిఖిల్ చిత్రానికి 'బాహుబలి' టెక్నీషియన్

*  హీరోయిన్ అయిన తర్వాత తనకు ప్రేమలేఖలు రావడం మొదలైందని చెబుతోంది కథానాయిక కాజల్ అగర్వాల్. "నాకొచ్చే లేఖల్ని నేనే చదువుతాను. ఆ ప్రేమలేఖల్లో అభిమానులు ఎంతో ప్రేమ కురిపిస్తూ వుంటారు. అయితే కొందరు రక్తంతో కూడా రాస్తుంటారు. అలాంటివి చూస్తే మాత్రం భయమేస్తుంది" అని చెప్పింది.      
*  కమలహాసన్ తను కథానాయకుడుగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'విశ్వరూపం 2' చిత్రం డబ్బింగ్ పనులు నిన్నటి నుంచి జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను అమెరికాలో నిర్వహిస్తున్నారు. గతంలో కమల్ చేసిన 'విశ్వరూపం' మంచి విజయాన్ని సాధించిన సంగతి విదితమే.
*  వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'తొలిప్రేమ' చిత్రం విడుదల ఒక రోజు వాయిదా పడింది. దీంతో మొదట్లో చెప్పినట్టు ఫిబ్రవరి 9న కాకుండా 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో రాశిఖన్నా కథానాయికగా నటించింది.
*  తమిళంలో హిట్టయిన 'కనితన్' చిత్రాన్ని యంగ్ హీరో నిఖిల్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. తమిళ ఒరిజినల్ దర్శకుడే దీనికి కూడా దర్శకత్వం వహిస్తాడు. కాగా, 'బాహుబలి' చిత్రం తర్వాత సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ అందిస్తున్నాడు.      

  • Loading...

More Telugu News