rajinikanth: అది మేక తలకాయ: రజనీకాంత్ పార్టీ గుర్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శరత్ కుమార్

  • రజనీవి అవకాశవాద రాజకీయాలు
  • జయలలిత ఉన్నప్పుడు విదేశాలకు పారిపోయారు
  • కావేరీ జల వివాదంపై ఆయన వైఖరి స్పష్టం చేయాలి

త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపించబోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీ అధినేత శరత్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ అవకాశవాద రాజకీయాలకు తెరలేపారని అన్నారు. రజనీ చూపించే గుర్తు 'బాబా'ది కాదని... అది మేక తలకాయ అని ఎద్దేవా చేశారు. అది ఓ సీక్రెట్ సొసైటీకి చెందిన సింబల్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 జయలలితకు భయపడి రజనీ 1996లో విదేశాలకు పారిపోయారని... ఆ తర్వాత మళ్లీ కరుణానిధి ప్రభుత్వం వచ్చాకే ఇక్కడకు తిరిగొచ్చారని అన్నారు. అవకాశవాద రాజకీయాలతో లబ్ధి పొందాలని అనుకుంటున్నారని విమర్శించారు. కావేరీ జల వివాదంపై రజనీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ శరత్ కుమార్ పైవ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారాయి.

rajinikanth
sharath kumar
kollywood
tamilnadu politics
  • Loading...

More Telugu News