Etala rajender: కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది!: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్

  • ఉత్పత్తులు పెరగటానికి 24 గంటల విద్యుత్ ప్రధాన భూమిక
  • 17.8% గ్రోత్ తో దేశం లోనే నెంబర్ వన్ గా నిలిచిన తెలంగాణ
  • దేశ ఎగుమతుల్లో 70% వాటా సాధించిన 5 రాష్ట్రాల్లో తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో దూసుకుపోతోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇది మనం చెప్పుకోవడం కాదు అని, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ పార్లమెంట్ వేదికగా చెప్పారని మంత్రి అన్నారు. ఉద్యమ సమయంలో ఏ విధంగా పనిచేశామో అదే ఉద్యమ స్పూర్తితో, కమిట్మెంట్ తో, కన్వెక్షన్ తో పని చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి అనడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు గొప్ప ఉదాహరణ అని ఆయన అన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ విధానాలతో పాటు, మౌలిక వసతులు కూడా అవసరం అని వాటిని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. ఉత్పత్తులు పెరగటానికి 24 గంటల విద్యుత్ ప్రధాన భూమిక అని, పరిశ్రమలు 24 గంటలు పనిచేస్తున్నాయని.. దీంతో పారిశ్రామిక వేత్తలు అందులో పనిచేస్తున్న కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారని మంత్రి అన్నారు. కరెంట్ వినియోగంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామని, దేశ జీడీపీ కంటే 4 % అధికంగా ఉన్నామన్నారు.

స్టేట్ ఔన్డ్ టాక్స్ గ్రోత్ 21.9% ఉండగా, యావరేజ్ గా 17.8% గ్రోత్ తో  దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచి తెలంగాణ సత్తాచాటామని పేర్కొన్నారు. ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతుంటే మనం హరితహారంతో పరిష్కారం చూపిస్తున్నామని, జీవితం, జీవం గురించి పట్టించుకుంటున్న రాష్ట్రం మనదని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రోడ్ల నిర్మాణం, ప్రశాంత వాతావరణం కల్పిస్తున్న శాంతిభద్రతలు, ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించడం ఇవన్నీ తెలంగాణ అభివృద్ధికి కారణం అని అన్నారు.

 2 సంవత్సరాల లోపే భారీ నీటిపారుదల ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న ఘనత కూడా మనదే అన్నారు. దేశ ఎగుమతుల్లో 70% వాటా సాధించిన 5 రాష్ట్రాల్లో మనం ఉండడం గర్వకారణం అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికి మన పట్ల ఢిల్లీ వైఖరి మారిందని, మొదట్లో పట్టించుకోని వారు ఇప్పుడు గౌరవిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. మన విధానాల వల్ల దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు అందించేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని మంత్రి ఈటల పేర్కొన్నారు.

Etala rajender
KCR
Telangana
Hyderabad
  • Error fetching data: Network response was not ok

More Telugu News