Samrat Reddy: భార్య ఇంట్లో దొంగతనం చేసి అరెస్టయిన 'పంచాక్షరి' నటుడు సామ్రాట్ రెడ్డి!

  • దొంగతనం కేసు పెట్టిన భార్య హర్షిత
  • అరెస్ట్ చేసిన పోలీసులు
  • గతంలో సామ్రాట్ పై వరకట్న వేధింపుల కేసు

యువ నటుడు సామ్రాట్ రెడ్డిపై అతని భార్య హర్షిత హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ లో దొంగతనం కేసు పెట్టడం కలకలం రేపింది. గతంలో రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ లో హర్షిత వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఐపీసీ సెక్షన్ 498/ఏ కింద నమోదైన ఆ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తాజా కేసులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని నిర్ధారించిన పోలీసులు, ఈ ఉదయం ఆయన్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గత కొంతకాలంగా సామ్రాట్, హర్షిత విభేదాల కారణంగా విడివిడిగా ఉంటున్నారు.

తాను ఇంట్లో లేని సమయంలో వచ్చిన సామ్రాట్, తనకు చెందిన వస్తువులని చెబుతూ, పలు విలువైన వస్తువులను తీసుకెళ్లాడని ఆమె ఫిర్యాదు చేశారు. సామ్రాట్ పలు తెలుగు చిత్రాల్లో నటించాడు. కొంతకాలం క్రితం జరిగిన వీరి వివాహానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆపై వీరి మధ్య గొడవలు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, అనుష్క ప్రధానపాత్రలో నటించిన 'పంచాక్షరి' చిత్రంలో ఆమె భర్తగా నటించిన సామ్రాట్, మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆపై తెలుగు, తమిళ సినిమాల్లో పలు క్యారెక్టర్లు చేశాడు. ఒకటి రెండు కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించాడు.

Samrat Reddy
Harshita
Theft
Hyderabad
Panchakshari
Madapur
Police
Arrest
  • Loading...

More Telugu News