Raviteja: మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న రవితేజ

  • శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంథోని'
  • ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • యూఎస్ లో ఎక్కువభాగం చిత్రీకరణ  

'రాజా ది గ్రేట్' తో హిట్ కొట్టేసిన రవితేజ, వచ్చేనెల 2వ తేదీన 'టచ్ చేసి చూడు'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతూ ఉండగానే, తదుపరి సినిమాను శ్రీను వైట్లతో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి 'అమర్ అక్బర్ అంథోని' అనే టైటిల్ ను పరిశీస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ సినిమాలో అమర్ .. అక్బర్ .. అంథోనిగా మూడు పాత్రల్లోను రవితేజ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు పాత్రల్లోను రవితేజ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నట్టు చెబుతున్నారు. ప్రతి పాత్ర లుక్ .. బాడీ లాంగ్వేజ్ ప్రత్యేకంగా ఉండేలా శ్రీను వైట్ల డిజైన్ చేశాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్, ఏప్రిల్ నుంచి మొదలు కానుంది. యూఎస్ లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుందని చెబుతున్నారు. కథానాయిక .. ప్రతినాయకుడు ఎవరనేది త్వరలోనే తెలియనుంది.      

  • Loading...

More Telugu News