ipl: ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతిపిన్న వ‌య‌స్కురాలు.. జాన్వి మెహ‌తా

  • ఈమె న‌టి జూహీచావ్లా కూతురు
  • లండ‌న్‌లో చ‌దువుకుంటోన్న 17 ఏళ్ల జాన్వి
  • కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు ఫ్రాంచైజీలో జూహీ ఒక‌రు

ఇటీవ‌ల బెంగ‌ళూరులో నిర్వ‌హించిన ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలంలో ప్రీతి జింటా త‌ర్వాత అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన యువతి మ‌రొక‌రు ఉన్నారు. ప‌క్క‌న ఉన్నవారి సూచ‌న‌ల మేర‌కు ఆట‌గాళ్ల కోసం వేలంలో పోటీ ప‌డిన ఈ 17 ఏళ్ల యువ‌తి పేరు జాన్వి మెహ‌తా. బాలీవుడ్ న‌టి జూహీ చావ్లా కూతురు. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్ జ‌ట్టు ఫ్రాంచైజీలో జూహీకి భాగస్వామ్యం ఉంది. అందుకే వేలంలో పాల్గొన‌డానికి త‌ల్లితో పాటు జాన్వి కూడా హాజ‌రైంది.

వేలానికి హాజ‌రైన వారిలో అతిపిన్న వ‌య‌స్కురాలిగా జాన్వి నిలిచింది. ప్ర‌స్తుతం లండన్‌లో చ‌దువుకుంటున్న జాన్వి ఈ మ‌ధ్యే ఇండియా వ‌చ్చింది. వేలం అనంత‌రం మీడియాతో మాట్లాడిన జాన్వి త‌మ జ‌ట్టు క్రిస్‌ లిన్‌ను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. త్వ‌ర‌లో ప్రారంభంకానున్న ఐపీఎల్ మ్యాచుల‌కు కూడా త‌ల్లితో క‌లిసి జాన్వి హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఓ అంచ‌నా.

ipl
jhanvi mehta
franchise
kkr
kolkata night riders
juhi chawla
  • Error fetching data: Network response was not ok

More Telugu News