jawan: మైనస్ 30 డిగ్రీల చలిలో రెపరెపలాడిన జాతీయ జెండా... వీడియో చూడండి!
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేసిన జవాన్లు
- 18వేల అడుగుల ఎత్తులో పతకావిష్కరణ
- శభాష్ అంటున్న నెటిజన్లు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మైనస్ 30 డిగ్రీల గడ్డకట్టే చలిలో, సముద్రమట్టానికి 18 వేల అడుగుల ఎత్తున జాతీయ పతాకాన్ని ఎగురవేసి జవాన్లు తమ దేశభక్తిని చాటుకున్నారు. హిమాలయ సరిహద్దులోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు జెండా ఎగురవేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చేతిలో జాతీయ జెండా పట్టుకుని మంచు గడ్డల మధ్య సైనికులు నడుస్తుండటం ఈ వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియోను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా భారత ప్రజలను క్షేమంగా ఉంచడమే కాకుండా, సమయానికి తగినట్లుగా తమ దేశభక్తిని చాటుకున్న జవాన్లను ట్విట్టర్ జనం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వారు చూపించిన దేశభక్తికి ఫిదా అయిన నెటిజన్లు ఈ వీడియోకు శభాష్ అని, గర్వపడుతున్నామని కామెంట్లు పెడుతున్నారు.