Ramgopal Varma: నన్ను మరో మెట్టు ఎక్కించిన వర్మకు థ్యాంక్స్!: కీరవాణి

  • జీఎస్టీకి సంగీతాన్ని అందించిన కీరవాణి
  • తన సంగీతం మరో మెట్టు ఎక్కిందని వ్యాఖ్య
  • త్వరలోనే హారర్ వయొలెన్స్ చిత్రాలకూ సంగీతం
  • తనను నమ్మిన ఓ పిచ్చి దర్శకుడు వర్మన్న కీరవాణి

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ)తో తన సంగీతాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో మెట్టు ఎక్కించాడని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పొగడ్తలు కురిపించారు. సెల్యులాయిడ్ పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు తనతో 1991లో 'రొమాన్స్'ను, 1992లో 'కామెడీ'ని, 2018లో 'సెక్స్'ను పలికించాయని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

ఇక ఈ సంవత్సరంలో ఆయన తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించనున్నానని చెప్పారు. తనను నమ్మిన ఓ పిచ్చి సినీ దర్శకుడికి కృతజ్ఞతలని అన్నారు. కాగా, కీరవాణి చేసిన ఈ ట్వీట్ ను చూసిన తరువాత 'థ్యాంక్స్ కీరూ' అని వర్మ సమాధానం ఇచ్చాడు.

Ramgopal Varma
MM Keeravani
God S*x and Truth
Music
  • Error fetching data: Network response was not ok

More Telugu News