Hyderabad: హైదరాబాద్ శివార్లలో నెత్తురోడిన రహదారి... ముగ్గురు ఫేస్ బుక్ ఉద్యోగుల మృతి

  • చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘటన
  • అదుపుతప్పి మర్రిచెట్టును ఢీకొన్న ఆల్టో
  • మరో యువకుడికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ నగర శివారులోని చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఫేస్ బుక్ ఉద్యోగులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఉద్యోగికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న ఆల్టో కారు వేగంగా వస్తూ, ఓ మలుపు వద్ద అదుపుతప్పి మర్రిచెట్టును ఢీకొంది.

ఈ ఘటనలో ప్రవీణ్, డేవిడ్, అర్జున్ అనే యువకులు మరణించగా, శ్రావణ్ అనే యువకుడి రెండు కాళ్లూ విరిగిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన శ్రావణ్ ను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

Hyderabad
Chevella
Accident
Facebook
  • Loading...

More Telugu News