Pawan Kalyan: నన్ను జైల్లో పెట్టినా భయపడను.. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా: పవన్ కల్యాణ్

  • రాయలసీమ సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళతా 
  • రాయలసీమకు ఏ విధంగా మేలు చేస్తారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి
  • నాపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనకడుగు వేయను
  • రైతులు కన్నీరు పెడితే అది పాలకులకు శాపం అవుతుంది

సమస్యలపై తాను నిరంతర పోరాటం చేస్తానని, రాయలసీమ సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఈ రోజు అనంతపురంలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ... రాయలసీమకు ఏ విధంగా మేలు చేస్తారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని అన్నారు. త‌న‌పై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా జైలులో పెట్టినా భయపడనని చెప్పారు.

తాను రైతునని, రైతుల కష్టాలు త‌నకు తెలుసని, రైతులు సంతోషంగా ఉంటేనే సమాజానికి మేలని పవన్ కల్యాణ్‌ అన్నారు. రైతులు కన్నీరు పెడితే అది పాలకులకు శాపం అవుతుందని చెప్పారు. రైతులు కన్నీరు పెట్టని అనంతపురాన్ని చూడాలనే ఉద్దేశంతోనే ఇటువంటి సదస్సులు పెడుతున్నాన‌ని తెలిపారు. తాను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని, ప్రజలంతా కలిసి ఐక్యంగా కృషి చేస్తే రాయలసీమను అభివృద్ధి చేయవచ్చని అన్నారు. అడ్డంకులను అధిగమించి ఎదగడమే జీవితమని హిత‌వు ప‌లికారు. 

  • Loading...

More Telugu News