ipl auction: ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని క్రిస్ గేల్.. ఎవరెవరు ఎంతకు అమ్ముడుపోయారంటే..!

  • ఐపీఎల్-2018 వేలం పాట
  • రూ. 7.6 కోట్లకు అమ్ముడుపోయిన అశ్విన్
  • బెన్ స్టోక్స్ ధర రూ. 12.5 కోట్లు  

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ కు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ కు జరుగుతున్న వేలం పాటలో క్రిస్ గేల్ ను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు ముందుకు రాలేదు. గత ఏడాది ఐపీఎల్ వేలంలో రూ. 14.50 కోట్లకు అమ్ముడుపోయిన స్టోక్స్ ఈ ఏడాది అంత ధర పలకలేదు. రూ. 12.5 కోట్లకే ఆయనను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

శిఖర్ ధావన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 5.2 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రూ. 7.6 కోట్లతో దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరలో వేలానికి వచ్చిన అశ్విన్ భారీ మొత్తానికి అమ్ముడుపోవడం విశేషం. కీరన్ పొలార్డ్ ను ముంబై ఇండియన్స్ రూ. 5.4 కోట్లకు సొంత చేసుకుంది. వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.   

ipl auction
ipl 2018
chris gayle
Ravichandran Ashwin
  • Loading...

More Telugu News