Visakhapatnam District: విడాకులిచ్చిందన్న అక్కసుతో భార్యను కారుతో ఢీ కొట్టిన భర్త

  • భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రులతో ఉంటున్న మహిళ
  • మరోవ్యక్తితో కలిసి నడుస్తుండగా కారుతో ఢీ కొట్టిన మాజీ భర్త
  • తీవ్రగాయాలతో బయటపడిన బాధితుడు

విశాఖపట్టణంలో శాడిస్టు భర్త నిర్వాకం అగనంపూడిలో కలకలం రేపింది. విభేదాల కారణంగా భర్త నుంచి విడాకులు పొందిన మహిళ అగనంపూడిలోని తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. తనను కాదన్న భార్య అంతుచూడాలని భావించిన ఆ భర్త... ప్రణాళిక ప్రకారం, ఆమె మరోవ్యక్తితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో వారిని కారుతో ఢీ కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్ధానికులు బాధితుడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. 

  • Loading...

More Telugu News