Virat Kohli: రసపట్టులో మూడో టెస్టు.. భారత్ వైపే మొగ్గు!

  • మూడో టెస్టులో పట్టుబిగించిన భారత్
  • బౌన్సీ పిచ్‌పై బంతులను ఎదురొడ్డి పరుగులు సాధించిన భారత్
  • ఆరంభంలోనే వికెట్ కోల్పోయి కష్టాల్లో సఫారీలు

జొహన్నెస్‌బర్గ్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రసకందాయంలో పడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకబడి సిరీస్‌ను కోల్పోయిన భారత్ ఈ టెస్టులో గెలిచి పరువు దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. అనుకున్నట్టే మ్యాచ్‌పై పట్టు బిగించింది. ప్రత్యర్థికి 240 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ శుక్రవారం ఓ వికెట్ పడగొట్టి ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేసింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. గెలుపు కోసం ఇంకా 224 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్‌కు 9 వికెట్లు అవసరం.

ఓవర్‌నైట్ స్కోరు 49/1తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ బౌన్సీ పిచ్‌పై జాగ్రత్తగా ఆడింది. బంతులతో సఫారీ బౌలర్లు బెదిరిస్తున్నా ఆచితూచి ఆడుతూ స్కోరును పెంచారు. అజింక్యా రహానే 48, కెప్టెన్ కోహ్లీ 41 పరుగులతో పోరాడారు. భువనేశ్వర్ కుమార్ 33 పరుగులతో చక్కని భాగస్వామ్యం అందించాడు. చివర్లో షమీ (28) రెండు సిక్సర్లు బాదడంతో స్కోరు 247 పరుగులకు చేరుకుంది.

అనంతరం 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే తడబాటుకు గురైంది. 5 పరుగుల వద్ద అయిడెన్ మార్క్‌రమ్ (4) షమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ప్రస్తుతం డీన్ ఎల్గార్ (11), హషీం ఆమ్లా (2) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News