Police: బంధువులు, స్నేహితులనే లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తోన్న అన్నదమ్ములు.. మేనత్తను హత్య చేసిన వైనం!

  • విశాఖపట్నంలో ఘటన
  • మేనత్తను గొంతుకోసి హతమార్చిన వైనం
  • నాలుగేళ్ల నుంచి దొంగతనాలు
  • ఎట్టకేలకు ఒకరిని పట్టుకున్న పోలీసులు

వ్యసనాలకు బానిసలై.. బంధువులు, స్నేహితులనే లక్ష్యంగా చేసుకున్న అన్నదమ్ములు చోరీలకు పాల్పడుతోన్న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. మెడలోని బంగారు గొలుసు చోరీచేయడానికి మేనత్తను సైతం వీరు గొంతుకోసి హతమార్చారు. వీరిరువురిపై పలు పోలీస్ స్టేషన్లలో 15 కేసులు ఉన్నాయి. నాలుగేళ్ల నుంచి వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు తాజాగా పోలీసులకు దొరికాడు.

అలాగే వారికి సహకరిస్తోన్న బంగారం వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు విశాఖపట్నం గండిగుండం గ్రామానికి చెందిన అన్నదమ్ములు గండ్రెడ్డి అప్పలరాజు (36), గండ్రెడ్డి సత్తిబాబు(32) అని పోలీసులు వివరించారు. ఈ అన్నదమ్ములు చోరీ చేసిన బంగారాన్ని గోపాలపట్నం ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యాపారికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. సదరు అన్నదమ్ములు చైన్ స్నాచింగ్‌లకు కూడా పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

Police
arrrested
brothers
  • Loading...

More Telugu News