Ramgopal Varma: వాడో దొంగ, చాలా సార్లు వదిలేశాను: 'జీఎస్టీ' తనదేనన్న జైకుమార్ పై రాంగోపాల్ వర్మ తొలి స్పందన!

  • 'జీఎస్టీ' స్క్రిప్ట్ తనదేనంటున్న జై కుమార్
  • తప్పుడు ఆరోపణలని తేల్చి చెప్పిన వర్మ
  • తన ఆఫీసులో దొంగతనం చేశాడని వెల్లడి
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న వర్మ

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ) నేడు ఆన్ లైన్ మాధ్యమంగా విడుదల కానుండగా, ఆ కథ తనదేనని, తన వద్ద నుంచి స్క్రిప్ట్ దొంగిలించి తీశారని ఆరోపిస్తూ, జై కుమార్ అనే వ్యక్తి కోర్టుకు ఎక్కగా, ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వర్మ తొలిసారి స్పందించాడు.

జై కుమార్ వి తప్పుడు ఆరోపణలని తేల్చి చెప్పిన వర్మ, ఆయన తన కార్యాలయంలో పని చేసిన మాట మాత్రం నిజమేనని అన్నాడు. అతను ఓ దొంగని, తన ఆఫీసులో పలుమార్లు దొంగతనం చేస్తూ జై కుమార్ పట్టుబడ్డా వదిలేశానని, చివరకు 10 నెలల క్రితమే తన బృందం నుంచి తొలగించానని అన్నాడు. జై కుమార్ కు అనవసరంగా పబ్లిసిటీ ఇవ్వరాదన్న ఉద్దేశంతోనే తాను ఇన్ని రోజులూ మౌనంగా ఉన్నానని, ఇప్పుడిక అతనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నానని చెప్పాడు.

Ramgopal Varma
GST
Jai Kumar
  • Loading...

More Telugu News