Hyderabad: హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా కేవీబీ రెడ్డి నియామకం!

  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ
  • ఎల్ & టి ఎండి, సీఈఓ సుబ్రహ్మణ్యన్ కు రిపోర్టు చేయనున్న రెడ్డి
  • ఎస్సార్ పవర్ లిమిటెడ్ లో సీఈఓగా చేసిన కేవీబీ రెడ్డి

ఎల్ & టి హైదరాబాద్ మెట్రో రైల్ నూతన ఎండీగా, సీఈఓగా కేవీబీ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మెట్రో రైల్ (హైదరాబాద్) సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్ & టి ఎండి, సీఈఓ ఎన్ఎస్ సుబ్రహ్మణ్యన్ కు త్వరలోనే కేవీబీ రెడ్డి రిపోర్ట్ చేయనున్నారు.

కాగా, భోపాల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ (ఎన్ఐటి) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో ఆయన డిగ్రీ  పూర్తి చేశారు. 1983లో ఢిల్లీలోని ఎన్టీపీసీలో తన కెరీర్ ని ఆయన ప్రారంభించారు. ఎస్సార్ పవర్ లిమిటెడ్ సీఈఓ గా ఆయన పని చేశారు. గత ఇరవై రెండేళ్లుగా ఈ సంస్థతో ఆయనకు అనుబంధం ఉంది.

Hyderabad
metro rail
  • Loading...

More Telugu News