Deepika Padukone: దీపికా పదుకునే చెవులు, ముక్కుకోస్తే రూ.కోటి ఇస్తాం: క్షత్రియ మహాసభ సంచలన ప్రకటన

  • గతంలోనూ దీపికా పదుకునేకి హెచ్చరికలు
  • ఈ రోజు విడుదలైన 'పద్మావత్'
  • క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

'పద్మావత్' సినిమాలో నటించిన దీపికా పదుకునేపై దాడి చేస్తే భారీ నజరానా ఇస్తామంటూ రాజ్‌పుత్ కర్ణిసేన గతంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆ సినిమా విడుదలైన నేపథ్యంలో మళ్లీ ఇటువంటి హెచ్చరికలే వస్తున్నాయి. తాజాగా క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీపికా పదుకునే చెవులు, ముక్కు కోసిన వారికి త‌మ‌ కమ్యూనిటీ త‌ర‌ఫున రూ.కోటి న‌జ‌రానా ఇస్తామని ప్రకటన చేశారు. కాగా, పద్మావత్ సినిమా విడుదలయిన నేప‌థ్యంలో రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి.      

Deepika Padukone
Padmaavat
cinema
  • Loading...

More Telugu News