: బరువు పెరిగితే తిండియావ తగ్గుతుంది


అవునా.. నిజమేనా.. దీనికి రివర్సుగా అనుకుంటున్నామే. తిండియావ పెరగడం వల్లనే బరువు పెరుగుతారని భావిస్తున్నామే అనుకుంటున్నారు కదూ! కానీ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వారు దాదాపు రెండువేల మందిపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని కనుగొన్నారు. బరువు పెరిగిన వారి ఆహారపు అలవాట్లలో ఎక్కువ మార్పులు వస్తాయిట.

మనిషి కొన్ని కిలోల బరువు పెరిగితే అప్పటినుంచి తన ప్రతి చర్య గురించి అతిగా ఆలోచిస్తాడంటూ ఈ అధ్యయనం చెబుతోంది. ఇది ప్రవర్తనలో మార్పుతెస్తుందని, ఒక బ్రెడ్‌ ముక్క తిన్నాక, రెండోది తినడానికి సందేహిస్తారని అంటున్నారు. ఆహారపు అలవాట్ల విషయంలో అధిక బరువు పెరిగిన వారిలో మార్పు కనిపిస్తుందని పరిశోధకురాలు సుటిన్‌ చెప్పారు.

అయితే మనబోటి వారి సందేహం ఏంటంటే.. తిండిపోతులకు ఇది వర్తించదేమో. మధ్యలో బరువు పెరిగిన వారికి, ఆ స్పృహ తిండియావను తగ్గించడంలో పనిచేస్తుందేమో గానీ.. పుట్టినప్పటినుంచి తిండిపోతులుగా, స్థూలకాయులుగా ఉన్న వారికి అసలు తిండియావ తగ్గే ప్రసక్తే ఉండదు కదా!

  • Loading...

More Telugu News