nagachaitanya: 'సవ్యసాచి'ని పొగిడేస్తున్న మాధవన్!

  • చైతూ హీరోగా 'సవ్యసాచి'
  • హీరోయిన్ గా నిధి అగర్వాల్ 
  • కీలకమైన పాత్రల్లో భూమిక .. మాధవన్   

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో చైతూ పాత్రను చాలా డిఫరెంట్ గా చందూ మొండేటి డిజైన్ చేశాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, మాధవన్ .. భూమిక ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి విషయాలను .. విశేషాలను బయటికి వదలకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది.

 అయితే మాధవన్ మాత్రం ఈ సినిమా కంటెంట్ సూపర్బ్ గా ఉందని తన సన్నిహితులతో చెప్పాడట. దాంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది. 'అర్జున్ రెడ్డి' ఎలాంటి అంచనాలు లేకుండగా బయటికి వచ్చి సంచలన విజయాన్ని సాధించింది. అదే విధంగా 'సవ్యసాచి' కూడా సైలెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చేసి ఘన విజయాన్ని సాధించే ఛాన్స్ వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

nagachaitanya
nidhi agarwal
  • Loading...

More Telugu News