Newzeland: పసికూన ఆఫ్ఘన్ అద్భుత విజయం... యూ-19 క్వార్టర్స్ లో న్యూజిలాండ్ కు షాక్!

  • ఆఫ్ఘన్ చేతిలో ఓడిపోయిన ఆతిథ్య న్యూజిలాండ్
  • 202 పరుగుల తేడాతో ఓటమి
  • సెమీస్ లో పాక్ తో తలపడనున్న ఆఫ్ఘనిస్థాన్

ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ పోటీల్లో న్యూజిలాండ్ జట్టుకు పెను షాక్ తగిలింది. గ్రూప్ దశ దాటి నాకౌట్ లోకి ప్రవేశించిన ఆతిథ్య న్యూజిలాండ్ అనూహ్య రీతిలో పసికూన ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు 50 ఓవర్లకు 309 పరుగుల భారీ స్కోర్ చేసింది.

గుర్బాజ్ 69, జర్డాన్ 68, బహీర్ షా 67, అజ్మతుల్లా 66 పరుగులు చేశారు. ఆపై 310 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 28.1 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 202 పరుగుల భారీ విజయం ఆఫ్ఘన్ సొంతమైంది. ఆఫ్ఘన్ జట్టు సెమీఫైనల్ లో పాకిస్థాన్ తో తలపడనుండగా, భారత జట్టు తన తదుపరి మ్యాచ్ ని బంగ్లాదేశ్ తో ఆడనుంది.

Newzeland
Afghanisthan
Cricket
Under-19
  • Loading...

More Telugu News